Trending Video: అట్లుంటది అమ్మాయిలతోని..! అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించబోయి అడ్డంగా బుక్కయ్యాడు..
బైక్ అయినా.. కారైనా.. డ్రైవింగ్ అంటే అంత వీజీకాదండోయ్.. దానికి తగిన శిక్షణ, ప్రాక్టీసు...అబ్బో చాలా కావాలిమరి. అందుకే పాపం ఓ యువతి బైక్ నడపడం నేర్చుకోవాలనుకుంది.
బైక్ అయినా.. కారైనా.. డ్రైవింగ్ అంటే అంత వీజీకాదండోయ్.. దానికి తగిన శిక్షణ, ప్రాక్టీసు…అబ్బో చాలా కావాలిమరి. అందుకే పాపం ఓ యువతి బైక్ నడపడం నేర్చుకోవాలనుకుంది. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ గ్రౌండ్‌లోకి వెళ్లారు.. అలా ఇద్దరూ గ్రౌండ్‌కి వెళ్లాక రంగంలోకి దిగారు. అమ్మాయి బైక్ ముందు కూర్చుంది. వెనుక అబ్బాయి కూర్చున్నాడు. యువకుడు ఎలా డ్రైవ్ చేయాలో డైరెక్షన్ ఇస్తున్నాడు. కొద్ది దూరం బాగానే నడిపింది. అబ్బాయి కూడా హమ్మయ్య పర్లేదు అనుకున్నాడు… సరిగ్గా ఇప్పుడే కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ యువతి బ్రేక్‌కు బదులుగా స్కూటీ ఎక్సలేటర్‌ను ఒక్కసారిగా పెంచేసింది. అంతే! ఆ బండి రెండు మూడు వంకర్లు తిరుగుతూ దూసుకుపోయింది. యువకుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి ఇద్దరూ కలిసి బొక్కబొర్లా పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంత ఈజీ కాదు బ్రో’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘అమ్మాయిలతో అట్టుంటది బ్రో’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..