Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 27, 2021 | 10:56 AM

ఇక్కడ గుఱ్ఱం పైన కూర్చొని ఉన్న ఇతని పేరు గణాధిషా.. సంగారెడ్డి జిల్లాలోని ఆత్మకూరు గ్రామం. 65 ఏళ్ల వయసున్న ఈయన ఎక్కడికి వెళ్లినా గుర్రం పైనే వెళతాడు.. పొలం పనులకు, ఏదైనా ఊరికి వెళ్లాల్సి వచ్చిన అతని వాహనం ఇదే...

ఇక్కడ గుఱ్ఱం పైన కూర్చొని ఉన్న ఇతని పేరు గణాధిషా.. సంగారెడ్డి జిల్లాలోని ఆత్మకూరు గ్రామం. 65 ఏళ్ల వయసున్న ఈయన ఎక్కడికి వెళ్లినా గుర్రం పైనే వెళతాడు.. పొలం పనులకు, ఏదైనా ఊరికి వెళ్లాల్సి వచ్చిన అతని వాహనం ఇదే…ఇతనికి చిన్ననాటి నుంచి అలవాటుగా మారింది… గణధిషా.. చిన్నతనంలొనే చెరుకు మిషన్ లో చెయ్యిపడి తెగిపోయింది, అయినప్పటికీ, ఒకే చేతితో గుర్రాన్ని నడుపుతూ ఊరిలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు…

ప్రతి రోజు ఉదయం లేవగానే తన గుర్రాన్ని కడిగి అందంగా ముస్తాబు చేస్తుంటాడు… గతంలో కూడా ఓ గుర్రం ఉండగా అది చనిపోవడంతో 10వేల రూపాయలతో ఈ గుర్రాన్ని కొని దీని పైన ప్రయాణం చేస్తున్నాడు.. పూర్వం కూడా వాళ్ళ తాతలు,తండ్రులు సైతం గుర్రాలనే వాడేవారట…. అదే అలవాటు ఇతనికి అబ్బింది… పశువులకు గడ్డి, ఇతర సామాన్లు ఏవైనా సరే… గుర్రం పైనే తెస్తాడు.ప్రస్తుతం ఈ కుంటుంబం లో గణాదిషా ఒక్కడే గుర్రాని వాడుతున్నాడు.. ఇంట్లో రెండు బైకులు ఉన్న ఒక్కసారి కూడా వాటి పైన ఎక్కలేదు… చిన్నప్పటి నుండి గుఱ్ఱం పైన తిరగడం అలవాటు అయ్యిందని, తామంతా బైకులు వాడినా,.తమ తండ్రి మాత్రం…గుర్రం పైనే వస్తాడని చెబుతున్నారు గణాదిషా పిల్లలు.

ఒంటి చేత్తోనే…గుర్రంపై సవారీ చేస్తూ…అందరిని అవాక్కయ్యేలా చేస్తుండని గ్రామస్తులు చెబుతున్నారు.. రక రకాల వాహనాలు అందుబాటులోకి వచ్చినా…వాటిని కాదని ఇతను ఇలా గుఱ్ఱం వాడడం చూస్తే విచిత్రంగా అన్పిస్తుంది అని… వాహనాలపై రోడ్డు మీదకు పోతే పోలీసులు హెల్మెట్ లేదని, ఓవర్ స్పీడ్ అని జరిమానాలు విధిస్తారు..కానీ, ఇతనికి అలాంటి భయలేవీ లేవంటూ గ్రామ యువత, నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

 police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

 ఈసారి బిగ్ బాస్‌ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?

 RS.2 crore For Haircut Video: హెయిర్‌కట్‌లో పొరపాటు..రూ.2 కోట్లు నష్టపరిహారం..! వైరల్ గా మారిన వీడియో