Viral Video: చేపల కోసం వెళ్తే.. వలకు చిక్కిన వింత జీవి.. షాక్ లో మత్స్యకారులు.. వైరల్ అవుతున్న వీడియో..
చేపల కోసం వేటకు వెళ్లిన ఇద్దరు అమెరికన్ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లిన ఈ ఇద్దరికీ ఐదు అడుగుల పొడవున్న ఎలిగేటర్ గార్ చేప చిక్కింది.
చేపల కోసం వేటకు వెళ్లిన ఇద్దరు అమెరికన్ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లిన ఈ ఇద్దరికీ ఐదు అడుగుల పొడవున్న ఎలిగేటర్ గార్ చేప చిక్కింది. ఈ అరుదైన చేపను జెట్ బ్లాక్ రివర్ బీస్ట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చేప ఎంత భయంకరంగా ఉందో.. ఈ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది.ఈ ఎలిగేటర్ గార్ చేపలు ప్రశాంతమైన నదుల్లో ఉంటాయని.. అవి మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవరైనా వాటిని పట్టుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నించినట్లయితే, అవి తమను తాము రక్షించుకోవడానికి ఎంతకైనా వెనకాడవని చెప్పారు. కాగా, గతంలో హ్యూస్టన్ సమీపంలో మరొక మత్స్యకారుడికి 8 అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న 300-పౌండ్ల ఎలిగేటర్ గార్ చేప చిక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!