Lockdown Effect: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!

|

Oct 07, 2024 | 12:21 PM

ప్రపంచమంతా కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో గది గోడలకే పరిమితమైంది. దీంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి.

ప్రపంచమంతా కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో గది గోడలకే పరిమితమైంది. దీంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా అన్ని వ్యవస్థలు స్తబ్దుగా మారిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదల పూర్తిగా ఆగిపోయింది.

ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. ఈ అధ్యయన వివరాలు పీర్ రివ్యూడ్ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ: లెటర్స్’లో పబ్లిష్ అయ్యాయి. 2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది.

చంద్రుడిపై మనకు కనిపించే భాగంలో.. రాత్రి సమయంలో ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితల ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాక్‌డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలు తగ్గినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 నుంచి 2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే దీనికి కారణమన్నారు శాస్త్రవేత్తలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.