సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళ, యువకుడు

Updated on: Sep 12, 2025 | 2:49 PM

తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. దీంతో మహిళలు రెచ్చిపోతున్నారు. ఉచితంగా బస్సులో ప్రయాణించటమే గాక.. బస్సులోని సీట్లు కూడా తమవేనన్నట్లు బిహేవ్‌ చేస్తున్నారు. డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కున్న పురుషులను సీట్లలో కూర్చోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మహిళలపై తిరగబడితే ఏ అనర్ధం ముంచుకొస్తుందోనని కొందరు సర్దుకుపోతుంటే.. కొందరు మాత్రం వాగ్వాదం పెట్టుకుంటున్నారు.

ఇటీవల ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో బస్సులో ఓ పురుషుడితో సీటుకోసం గొడవపడి అతని చెంప చెళ్ళుమనిపించింది ఓ మహిళ. దాంతో ఇద్దరిమధ్య గొడవ తారస్థాయికిచేరి జుట్టు పట్టుకునేవరకూ వెళ్లారు. ఈ ఘటన మరువక ముందే ఇలాంటిదే మరో ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి నందిగం మండలం దిమ్మిడిజోల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ, యువకుడికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు మహిళ సీటులో కూర్చోబోతున్న యువకుడిని అడ్డుకొంది. దానికి అభ్యంతరం తెలిపిన యువకుడు.. ఆ సీటులో కూర్చోవటంతో ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో మహిళ.. అతడిపై దాడి చేయగా, అతడూ అంతే వేగంగా ప్రతి స్పందించటంతో బస్సులో వాతావరణం వేడెక్కింది. అయినా ఆమె తగ్గకపోవటంతో.. సహనం కోల్పోయిన యువకుడు జేబులోని పెన్నుతో మహిళ పై దాడి చేసే యత్నం చేశాడు. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన ప్రయాణికులు.. జోక్యం చేసుకుని వారిద్దరినీ అదుపు చేయగలిగారు. అయితే ఈ సీన్ అంతటిని ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేయడంతో వీరి కొట్లాట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై తెగ సెటైర్లు వేస్తున్నారు. టిక్కెట్‌ ఫ్రీ అన్నారు కానీ.. సీటు కాదు కదా అని కొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు

GST on Petrol Diesel:పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ తగ్గింపు కష్టమే..!

The World’s Billionaires: వెనుకబడ్డ ఎలన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుడిగా ల్యారీ ఎల్లిసన్

సింపుల్‌గా ముగించేసిన దీపిక కూతురి పుట్టినరోజు వేడుక!

TOP 9 ET News: మహేష్, బన్నీ బిజినెస్‌పై గురిపెట్టిన చరణ్‌