Wedding: ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు.. తెలుగు అబ్బాయి వెడ్స్ ఫ్రాన్స్ అమ్మాయి..

Updated on: Mar 01, 2023 | 9:58 PM

తెలుగు అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయిల వివాహ వేడుకకు కేంద్ర పాలిత ప్రాంతం యానాం వేదికైంది. విదేశాల్లో స్థిరపడినా సరే ఆ కుటుంబం తెలుగు సంప్రదాయాలను మర్చిపోలేదు..

తెలుగు అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయిల వివాహ వేడుకకు కేంద్ర పాలిత ప్రాంతం యానాం వేదికైంది. విదేశాల్లో స్థిరపడినా సరే ఆ కుటుంబం తెలుగు సంప్రదాయాలను మర్చిపోలేదు.. సొంత ఊరికి వచ్చి కుమారుడి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. యానాంకు చెందిన చింతా వెంకట్‌ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌‌లో స్థిరపడింది. చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్‌ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఫ్రాన్స్‌కు చెందిన యువతి క్లమెన్‌టైన్‌తో వివాహం నిశ్చయమైంది.రెండు కుటుంబాలు ఈ వివాహ వేడుకను యానాంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక గాజుల గార్డెన్స్‌ కల్యాణ మండపంలో సుమంత్, క్లమెన్‌టైన్‌ల పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల దంపతులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోలేదు వెంకట్ కుటుంబం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..