భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులే టార్గెట్‌గా అమర్చిన IEDని నిర్వీర్యం చేశాయి.. భద్రతా దళాలు. చర్ల మండలం అంజనాపురం వెళ్లే దారిలో..రహదారిపై IED అమర్చారు మావోయిస్టులు. ఎన్నికల సందర్భంగా పోలీసుల్ని టార్గెట్ చేసి IEDతో పేలుడుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. కూంబింగ్ సమయంలో IEDని గుర్తించారు. తాజాగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది దాన్ని పేల్చేశారు. ఈ ఘటన అనంతరం భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..