Harish Rao: కోమటిచెరువులో హరీశ్ రావు.. తామర పువ్వుతో భార్యకు లవ్‌ ప్రపోజ్‌.. వీడియో వైరల్..

|

Oct 10, 2022 | 7:42 PM

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుకు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాను షేక్‌ చేస్తోంది. త‌న సొంత నియోజ‌కవ‌ర్గం సిద్దిపేట‌లోని కోమ‌టిచెరువులో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేశారు.


తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుకు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాను షేక్‌ చేస్తోంది. త‌న సొంత నియోజ‌కవ‌ర్గం సిద్దిపేట‌లోని కోమ‌టిచెరువులో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేశారు. భార్యాపిల్లల‌ను బోటు ఎక్కించుకుని మంత్రి స్వయంగా బోటును న‌డిపారు. చెరువులో బోటు అలా సాగుతుండ‌గా… మంత్రికి ఓ తామ‌ర పువ్వు క‌నిపించింది. వెంటనే దానిని అందుకొని త‌న స‌తీమ‌ణి చేతికి అందించారు. ఈ వీడియోను మత్రి హరీష్‌రావు పర్సనల్‌ అసిస్టెంట్‌ రాంచందర్‌రావు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు వీనుల విందైన ఓ సినిమా పాట‌ను యాడ్ చేసి మ‌రీ రాంచంద‌ర్ రావు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై మంత్రి అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 10, 2022 07:42 PM