Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో కొత్త ట్రెండ్‌.. ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం వీడియో

ఇదో కొత్త ట్రెండ్‌.. ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం వీడియో

Samatha J

|

Updated on: May 25, 2025 | 7:47 AM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇలాంటి కలయిక సర్వసాధారణం. ఒకే బడిలో పది వరకు చదువుకున్న విద్యార్థులు కొన్నేళ్ల తర్వాత తిరిగి మళ్ళీ కలుసుకుని జరుపుకునే గొప్ప వేడుక. అపురూప కలయిక. అదో అద్భుత ఘట్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏమి తెలియని పసితనంతో పదేళ్ల పాటు కలిసి చదువుకున్న పిల్లలంతా తిరిగి పెద్ద వయసులో కలుసుకున్న ఆ క్షణాలు ఊహకందని ఆనందాన్నిస్తుంటాయి.

 చిన్నతనంలో వారు చేసిన అల్లరి, ఆటపాటలు నెమరు వేసుకుంటూ ఆనాటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం అనే మాట విన్నారా? కానీ కొత్తగా అలాంటి ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మన కొల్లూరు ఆడబిడ్డలు. అవును మీరు విన్నది నిజమే.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆడబిడ్డలు జరుపుకున్న ఓ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే ఊరిలో పుట్టి పెరిగిన ఆడపిల్లలంతా ఒక చోట చేరి జరుపుకున్న సంబరం ఆ ఊరి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆడపడుచులంతా కలిసి వదిన మరదలకు దావతిచ్చారు. వదినలు మరదలు అంతా కలిసి ఆడిపాడారు అల్లరి చేశారు.