కుక్కలు తరమగా .. మూడవ అంతస్తు ఎక్కిన ఆవు.. కిందకు రాలేక ఇబ్బంది
పుణె నగరంలో విచిత్ర ఘటన జరిగింది. వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఆవు ఏకంగా ఓ పాత కాలపు భవనం మూడో అంతస్తుకు చేరింది. ఈ అనూహ్య ఘటన రవివార పేట ప్రాంతంలోని పరిదేశి వాడలో జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో కొన్ని వీధి కుక్కలు ఓ జెర్సీ ఆవును వెంబడించాయి. భయంతో పరుగులు తీసిన ఆ ఆవు ప్రాణరక్షణ కోసం పరిదేశివాడలోకి ప్రవేశించింది. అక్కడున్న ఇరుకైన మెట్ల మార్గం గుండా పైకి ఎక్కుతూ ఏకంగా మూడో అంతస్తుకు చేరుకుంది.
ఉదయాన్నే పెద్ద శబ్దాలు రావడంతో మేల్కొన్న స్థానికులు మూడో అంతస్తులో ఆవును చూసి నివ్వరపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆవును కిందికి దించేందుకు ప్రయత్నించారు. అయితే మెట్లు చాలా ఇరుకుగా ఉండటం, ఆవు భయంతో ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. వీధి కుక్కలు వెంటాడటంతో భయపడిన జెర్సీ ఆవు భవన ప్రాంగణంలోకి వచ్చి ఇరుకైన మెట్ల ద్వారా మూడో అంతస్తుకు ఎక్కిందని ఓ అగ్నిమాపక అధికారి అన్నారు. ఈ ఆవును మెట్ల మార్గంలో నుంచి కిందికి తీసుకురావడం సాధ్యం కాదని వారు నిర్ధారించుకున్నారు.
వైరల్ వీడియోలు

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ
Latest Videos