Food Mafiya: బట్టబయలు అవుతున్న రెస్టారెంట్ల రహస్యాలు.. కల్తీ ఫుడ్ పై సీరియస్..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతన్న పేరుమోసిన రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల మెరుపుదాడులు చేస్తున్నారు. గతం వారం రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్‌లపై రైడ్స్ చేసి వాటి భాగోతం బట్టబయలు చేస్తున్నారు. లోట్టలేసుకొని లాగించే ఫుడ్ ప్రియుల కళ్లు తెరిపిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్‌లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ప్రజల కళ్లకు కడుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతన్న పేరుమోసిన రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారుల మెరుపుదాడులు చేస్తున్నారు. గతం వారం రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్‌లపై రైడ్స్ చేసి వాటి భాగోతం బట్టబయలు చేస్తున్నారు. లోట్టలేసుకొని లాగించే ఫుడ్ ప్రియుల కళ్లు తెరిపిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్‌లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ప్రజల కళ్లకు కడుతున్నారు. ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై మెరుపు దాడులు చేసి కాలం చెల్లిన ఆహారం, వస్తువులు, నూనె సీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మేడ్చల్‌లోని తాజా హాలిడే రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. స్టోర్‌రూమ్‌లో ఫుడ్ కలర్స్ గుర్తించారు అధికారులు. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు, నిమ్మకాయలు గుర్తించారు. లేబుల్ లేని టీపొడి, పురుగులు పట్టిన కొర్రలు సీజ్ చేశారు. అంతేకాకుండా వట్టినాగులపల్లి ప్రిజం రెస్టారెంట్, బార్‌లో అధికారులు తనిఖీలు చేశారు. కాలంచెల్లిన ఆహార పదార్థాలు సీజ్ చేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించారు.
హైదరాబాద్‌లో షురూ చేసిన టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ దాడులను తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రెస్ట్ ఇన్, శ్రీశ్రీ, హవేలీ రెస్టారెంట్‌లో తనిఖీలు కొనసాగించారు. విస్తుపోయే నిజాలు కళ్లకు కట్టారు. నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్, నాసిరకం మసాలాలు సీజ్ చేశారు. రెస్ట్ ఇన్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన చికెన్ కబాబ్ లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ అధికారులు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.