AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మామిడి పండు కిలో రూ.2.50 లక్షలు ఎందుకంటే వీడియో

ఈ మామిడి పండు కిలో రూ.2.50 లక్షలు ఎందుకంటే వీడియో

Samatha J

|

Updated on: May 09, 2025 | 5:23 PM

ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి చూశారా? కిలో మామిడికాయల ధర ఎంత ఉంటుంది? ₹150 మహా అయితే ₹300 పలుకుతాయి. కానీ ఈ మామిడికాయలు తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే వీటి ధర కిలో ₹2.50 లక్షలు. అందుకే ఈ చెట్లను సాగు చేస్తున్న కమ్మం జిల్లాకు చెందిన రైతు గరికపాటి విజయ్ ఇప్పుడు పంట కోతకు రావడంతో కుక్కలను కాపలాగా పెట్టి కాయలను అత్యంత పకడ్బందీగా రక్షిస్తున్నారు. కమ్మం రూరల్ మండలం, బారుగూడెం లోని శ్రీ సిటీలో మియా జాకీ మామిడి చెట్లను సాగు చేస్తున్నారు రైతు గరికపాటి విజయ్. ఈ మియా జాకీ మొక్కలను విదేశాల నుంచి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేయగా ప్రస్తుతం ఆ చెట్లకు కాయలు వచ్చాయి. 2020 కరోనా సమయంలో జపాన్ నుంచి మియా జాకీ రకానికి చెందిన 15 మామిడి మొక్కలను ఒక్కొక్కదానికి ₹11,000 పెట్టి తెచ్చి సాగు చేశారు. అందులో 10 చెట్లు మాత్రమే బతికాయి.

మూడేళ్ల తర్వాత అవి కోతకు వచ్చాయి. గత ఏడాది ఒక్కో చెట్టుకు 10 కాయలు కాస్తాయి. ఈ ఏడాది ఒక్కో చెట్టుకు సుమారు 20 నుంచి 30 కాయలు కాస్తాయి. ఈ రకం మామిడికాయలకు మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఈ ఏడాది మరో 60 మొక్కలు తీసుకొచ్చి సాగు చేశారు. మియా జాకీ మామిడి పండ్లకు జపాన్ లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ తోటలో కాసిన కాయలను ఆ దేశానికి ఎగుమతి చేసే యోచనలో ఉన్నామని రైతు గరికపాటి విజయ్ తెలిపారు. కాగా మియా జాకీ మామిడి సాగు కేవలం జపాన్ లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారని ఆ దేశ మార్కెట్లో వీటికి లక్షల్లో ధర ఉంటుందని వారు తెలిపారు. నా పేరు విజయ్ గరికపాటి. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వర్ కింద యూరోప్ లోనూ సింగపూర్ లో చేశాను. కరోనా టైంలో నా ఫ్రెండ్ ఒకళ్ళు మియా జాకీ ఎగ్జాటిక్ ప్లాంట్ దీన్ని జపనీస్ వెరైటీ ఇది మియా జాకీ ప్రిఫెక్చర్ లో పండుతుంది ఈ మొక్క. సో అది ఆయన పంపించినప్పుడు ఒక ట్రయల్ బేసిస్ లో 15 ప్లాంట్స్ తెప్పించాము. ఒక టెన్ ప్లాంట్స్ వేయడం బతికినాయి అవి లాస్ట్ ఇయర్ నుంచి ఫ్రూట్ ఫ్రూటింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక టెన్ ఫ్రూట్స్ ఏ వచ్చినాయి బట్ ఈ ఇయర్ మాత్రం ఒక 100 ఫ్రూట్స్ దాకా వచ్చినాయి. సో ఈ మియా జాకీ వెరైటీ గొప్పతనం ఏంటి అంటే దీనికి మెడిసిన్ గుణాలు ఎక్కువ ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం :

డేగాకు పాస్ పోర్ట్.. ఏ దేశం ఇచ్చిందంటే వీడియో

బస్సును ఢీ కొట్టిన బైక్..సీన్ కట్ చేస్తే వీడియో

షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే అధిక ప్రోటీన్ వీడియో