నీట్ మాక్ టెస్ట్‌లో మార్కులు తక్కువొచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే
ఆ అమ్మాయి ఓ బ్రిలియంట్ స్టూటెండ్, ఆమె 10వ తరగతి బోర్డు పరీక్షలలో 92.60 శాతం మార్కులు సాధించింది. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ సమయంలో నీట్ ఎంట్రెన్స్ కోసం ప్రిపరేషన్‌లో భాగంగా రాసిన ఒక మాక్‌టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లిలో వెలుగు చూసింది.
సాంగ్లికి చెందిన ధోండిరామ్ భోంస్లే స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 17 ఏళ్ల ఓ కూతురు ఉంది. ఆమె పేరు సాధన భోంస్లే, ఈమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రీ-మెడికల్ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ కోసం శిక్షణ తీసుకొంటోంది. అయితే నీట్ ఎంట్రెన్స్ కోసం ప్రిపరేషన్‌లో భాగంగా సాధన భోంస్లే మాక్ టెస్ట్ లు రాస్తోంది. ఈ క్రమంలో ఒక మాక్ టెస్ట్‌లో సాధనకు తక్కువ మార్కులు రావడంతో ధోండిరామ్ భోంస్లే ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంలో కర్ర తీసుకొని సాధనను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. తండ్రి దాడిలో సాధన తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను తండ్రి హాస్పిటల్‌కు తరలించాడు. కాగా సాధన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సాధన తల్లి జూన్ 22న భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురికి నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు రావడంతో తండ్రి తీవ్రంగా కొట్టాడని, తీవ్రంగా గాయపడిన తన కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని సాధన తల్లి ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధన తండ్రి బోంస్లేను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా
కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్
గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోనుందా.. కారణం అదేనా ??
ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ
ధోనీ ఫ్యాన్ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
