AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు

సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు

Phani CH
|

Updated on: Nov 07, 2025 | 3:40 PM

Share

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో ఉద్యోగాల కోత సంచలనంగా మారింది. 2025లో ఇప్పటివరకు 218 కంపెనీలు 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు `లేఆఫ్స్.ఎఫ్‌వైఐ` డేటా వెల్లడించింది. వృద్ధి మందగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్‌ వైపు వేగంగా మళ్లుతుండటం వంటివి ఈ ప్రతికూల మార్పుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ఇక.. అమెజాన్, ఇంటెల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వేలాది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నాయి. అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఆపరేషన్స్, హెచ్‌ఆర్, విభాగాల్లోని 14,000 కార్పొరేట్ ఉద్యోగాలు సహా మొత్తం 30,000 మందిని తొలగిస్తోంది. కంపెనీని ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా’ నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. చిప్‌మేకర్ ఇంటెల్ కూడా 24,000 ఉద్యోగాలను అంటే మొత్తం సిబ్బందిలో 22 శాతం తగ్గించనుంది. పీసీలకు డిమాండ్ తగ్గడంతో ఎన్విడియా, ఏఎండీ వంటి పోటీదారులతో ఇంటెల్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సైతం తన చరిత్రలోనే అత్యంత భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. సెప్టెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మందిని తొలగించింది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2022 తర్వాత మొదటిసారిగా 6 లక్షల దిగువకు చేరింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌పై దృష్టి సారించడమే కారణం. యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ కూడా వేలాది మందిని తొలగించాయి. ఏఐ, క్లౌడ్ సేవలపై పెట్టుబడులను పెంచేందుకు మైక్రోసాఫ్ట్ 9,000 మందిని, కస్టమర్ సేవలను ఏఐ ఆటోమేట్ చేస్తుండటంతో సేల్స్‌ఫోర్స్ 4,000 మందిని తొలగించాయి. సిస్కో, గూగుల్, మెటా, ఒరాకిల్ కూడా ఏఐని కేంద్రంగా చేసుకుని పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తగ్గించాయి. ఈ లేఆఫ్స్ ట్రెండ్ కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఒకవైపు కంపెనీలు ఏఐ టూల్స్‌పై బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడి పెడుతుండగా, మరోవైపు సంప్రదాయ ఉద్యోగాలను తగ్గించుకోవాల్సి వస్తుండటం టెక్ రంగంలో కొత్త సవాలుగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు

TOP 9 ET News: ‘శభాష్‌ రామ్‌ చరణ్‌! మంచి నిర్ణయం తీసుకున్నావ్‌..’

బుద్ది లేనోడు.. గడ్డి తిన్నోడే.. అలా చేస్తాడు..

ఇలా అయితే అద్దె ఇంట్లో బతికేదెలా

చికెన్‌ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు