ఇలా అయితే అద్దె ఇంట్లో బతికేదెలా
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు, అడ్వాన్స్‌ల పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా రెడిట్‌లో ఒక యూజర్ చేసిన పోస్ట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. బెంగళూరు ఇంటి యజమానులు హద్దులు దాటిపోతున్నారు అంటూ.. ఆ యూజర్ షేర్ చేసిన ఒక స్క్రీన్‌షాట్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండే నగరం... బెంగళూరు.
సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు.. టెక్ ఉద్యోగులకు అడ్డా. బెంగళూరులో అయ్యే ఖర్చుల గురించి వింటే.. ఇతర ప్రాంతాల్లోని ప్రజలు నోరెళ్లబెడతారు. అక్కడి ఇళ్ల ధరలు, అద్దెలు విపరీతంగా ఉంటాయి. దీని గురించి ఇప్పటివరకు ఎన్నోసార్లు వినుంటారు.. చూసుంటారు.. కానీ ఇప్పుడు మేం చెప్పేది వింటే.. షాకవుతారు. ఓ నెటిజన్ చెప్పిన విషయం వింటే మాత్రం కచ్చితంగా మీరు నోరెళ్లబెడతారు. ఇంటి అద్దె తక్కువగానే ఉన్నా.. దానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద మాత్రం లక్షల్లో డిమాండ్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఫ్రేజర్ టౌన్ ప్రాంతంలో ఒక కొత్త 2బీహెచ్‌కే ఫ్లాట్‌కు సంబంధించిన వివరాలు రెడిట్‌లో ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ.20 వేలు.. సెక్యూరిటీ డిపాజిట్ రూ.30 లక్షలు చెల్లించాలని ఓనర్ డిమాండ్ చేసినట్లు ఆ నెటిజన్ తెలిపారు. ఫర్నీచర్ వంటి అన్ని సౌకర్యాలతో ఇల్లు ఉన్నప్పటికీ.. ఈ స్థాయిలో సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం అడగడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత డబ్బే ఉంటే.. ఇల్లు అద్దెకు తీసుకోవడం ఎందుకు.. వ్యాపారం చేసుకునేవాళ్లుం కదా అన్న కామెంట్ కూడా నెటిజన్ల నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు
చేతులెత్తి నమస్కరిస్తున్నా… దయచేసి ఇలాంటివి వద్దు
డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి.. ఈ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
TRP కోసం మరీ ఇంత నీచమా..! బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు
‘చికిరి లాంటి అమ్మాయి.. బీడీ కాలుస్తూ.. కొండకోనల్లో అబ్బాయి !!’ పాట అర్థం చెప్పిన బుచ్చిబాబు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

