‘చికిరి లాంటి అమ్మాయి.. బీడీ కాలుస్తూ.. కొండకోనల్లో అబ్బాయి !!’ పాట అర్థం చెప్పిన బుచ్చిబాబు
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇటీవల జాన్వీ కపూర్ రోల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిరి సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో చికిరి అంటే మీనింగ్ ఏంటో బుచ్చిబాబు స్వయంగా వివరించాడు., దాంతో పాటే పెద్ది టీం రిలీజ్ చేసిన వీడియోలో.. చరణ్ వేసిన స్టెప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతోంది. యునిక్‌గా ఉన్న ఆ హుక్ స్టెప్ అందరిని ఆకట్టుకుంటోంది. నిన్న కాక మొన్నే పెద్ది సినిమా నుంచి చికిరి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే చికిరి అనే పదానికి అర్థం చెప్పాడు ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు. ఈసారి పెద్ది నుంచి ఆట కాదు పాట రిలీజ్ చేయాలని అనుకుంటున్నానని రెహ్మాన్ స్టూడియోకు వెళ్లి చెప్పిన బుచ్చిబాబు.. వెంటనే ఆ సాంగ్ సిచ్యువేషన్ ఆయనకు వివరించాడు. పెద్దిలో హీరోయిన్ ను మొదటిసారి చూడగానే ఒక రకమైన ఫీలింగ్ కు హీరో గురవుతాడని.. అప్పుడు ఫ్రెండ్ తో కాటుక అక్కర్లేని కళ్లు.. ముక్కు పుడక అక్కర్లేని ముక్కు..అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరా అని చెబుతాడు. అయితే చికిరి అనే పదం దగ్గర స్టక్ అయిన రెహ్మాన్.. దాని అర్థం ఏంటని బుచ్చిబాబుని అడుగుతాడు. పెద్ది హీరో ఊర్లో అందమైన అమ్మాయిలను అలా ముద్దుగా పిలుస్తారని.. బుచ్చిబాబు చెప్పడంతో అయితే చికిరితోనే సాంగ్ చేద్దామంటాడు రెహమాన్. కట్ చేస్తే బీడీ కాలుస్తూ రామ్ చరణ్ వేసే హుక్ స్టెప్ వస్తుంది. అందర్నీ అరిపించేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మమ్మల్ని మా ఇంటికి పంపేయండి ప్లీజ్
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

