టాలీవుడ్ లోకి మోనాలిసా గ్రాండ్ ఎంట్రీ ??
కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా నిర్మాత సురేష్ కొండేటి, మోనాలిసా త్వరలో టాలీవుడ్‌లోకి కూడా రానున్నట్టు తెలిపారు. పూసల అమ్ముకునే అమ్మాయి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన మోనాలిసా కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ కు చెందిన సాధారణ అమ్మాయి మోనాలిసా ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించింది. కుంభమేళాకు వచ్చిన వారిని ఆమె సహజ సౌందర్యం, స్వభావం, స్మైల్ ఆకర్షించాయి. ఆమెను చూసినవారు సెల్ఫీల కోసం క్యూ కట్టడం, ఆమె వెళ్లిన చోటల్లా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె ఫోటోలు, వీడియోలు ప్రసారం చేయడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద నేషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆ వీడియోలను చూసి వెంటనే ఆమెను సంప్రదించారు. మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి నచ్చజెప్పారు. అమెకు యాక్టింగ్ తెలియకపోయినా తాను నేర్పిస్తానని, పాత్రను తన సామర్థ్యానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతాను అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు సరే అన్నారు. అలా మోనాలిసా.. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం పొందింది. మోనాలిసా క్రేజ్ నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ గట్టిగానే ఉంది. ఆమెకు మలయాళంలో ‘నాగమ్మ’ అనే చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లు వార్తలొచ్చాయి. మైథలాజికల్, దేవతా శక్తులు ఆధారంగా సాగే చిత్రంలో ఆమె దేవత పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో కూడా ఆమె ఎంటరైతే.. ఇక్కడి హీరోయిన్స్ కు పోటీ తప్పదేమో అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి

