మమ్మల్ని మా ఇంటికి పంపేయండి ప్లీజ్
వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని పాములన్నీ బయటకు వస్తాయి. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలకు భయాందోళనకు గురిచేస్తాయి. పొలాల్లో రైతులు పాము కాట్లకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఇళ్లలో చొరబడి ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ఇంట్లోవారిని పరుగులు పెట్టించిన ఘటనలు నెట్టింట చూసాం. వర్షాకాలంలో స్నేక్ క్యాచర్స్‌కి చేతినిండా పనే.
ప్రతిరోజూ ఏదో మూలనుంచి పాములు వచ్చాయంటూ సమాచారం వస్తూనే ఉంటుంది. అలా విశాఖ పట్నంలో అనేక పాములను పట్టుకొని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు ఓ స్నేక్ క్యాచర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. విశాఖపట్నం జిల్లాలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కొండచిలువలు, నాగుపాములు, కింగ్ కోబ్రాలు తరచూ జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలో స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్ ఎక్కడ పాము కనిపించిందని సమాచారం వచ్చినా వెంటనే అక్కడికి చేరుకొని పాములను పట్టుకొని అడవిలో వదిలిపెడుతూ ఉంటారు. ఇటీవల విశాఖ నగరంలోని పలు ప్రాంతాలల్లో జనావాసాల్లోకి వచ్చిన అనేక పాములను ఆయన పట్టుకున్నారు. వాటన్నింటిని భద్రంగా తన ఇంటివద్దే ఉంచారు. కొన్నిపాములు పోగయ్యాక ఒకేసారి అడవిలో వదులుదామని ఇంట్లో వాటిని భద్రపరిచి వాటికి ఆహారం అన్నీ ఇస్తూ కాపాడుతున్నారు. నవంబరు 4 మంగళవారం నాటికి చాలా పాములు పోగవడంతో తన బృందంతో కలిసి పాములన్నింటినీ తీసుకెళ్లి పరవాడ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో 20కి పైగా పాములు హ్యాపీగా అడవిలోకి వెళ్లిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

