AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

చికెన్‌ ఫ్రై కోసం పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

Phani CH
|

Updated on: Nov 07, 2025 | 3:01 PM

Share

పెళ్లి మండపంలో చికెన్ ఫ్రై చిచ్చు పెట్టింది. భోజనాల సందర్భంగా చికెన్ ఫ్రై కోసం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి మండపం కాస్తా రణ భూమిలా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. బిజ్‌నోర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు మొదలయ్యాయి భోజనాల దగ్గర చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వాళ్లకు గొడవ మొదలైంది.

పెళ్లి కూతురు తరఫు వారు.. ఉద్దేశ పూర్వకంగానే తమకు తక్కువ చికెన్ ఫ్రై వేస్తున్నారని పెళ్లి కొడుకు తరఫు వారు విందు జరుగుతుండగా గొడవకు దిగారు. దీంతో పెళ్లి కూతురు తరఫు వారు సారీ చెప్పి… ఎక్కువ మొత్తంలో చికెన్ ఫ్రై తెప్పించి, అడిగిన వారికి అడిగినంత వడ్డించారు. అయినా కూడా పెళ్లి కొడుకు బంధువులు సంతృప్తి చెందలేదు. ‘చికెన్ ఫ్రై వడ్డిస్తున్నారు గానీ.. మీ వడ్డనలో మేం వరుడి తరపు వారమనే మర్యాదే లేదు’ అని మళ్లీ గొడవకు దిగారు. వరుడి తరపు వారి తీరుతో విసిగిపోయిన వధువు కుటుంబ సభ్యులు, బంధువులు.. వెనక్కు తగ్గకుండా మాటకు మాట సమాధానం ఇచ్చారు. దీంతో, ఇరువర్గాల మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లటం, వారు పెళ్లి మండపానికి చేరుకుని గొడవను ఆపారు. అప్పటికే కొంతమంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ గుండె జబ్బు ఉన్న వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేతులెత్తి నమస్కరిస్తున్నా… దయచేసి ఇలాంటివి వద్దు

డేంజర్ జోన్‌లో సుమన్‌ శెట్టి.. ఈ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

TRP కోసం మరీ ఇంత నీచమా..! బిగ్ బాస్‌ పై తీవ్ర విమర్శలు

‘చికిరి లాంటి అమ్మాయి.. బీడీ కాలుస్తూ.. కొండకోనల్లో అబ్బాయి !!’ పాట అర్థం చెప్పిన బుచ్చిబాబు

మమ్మల్ని మా ఇంటికి పంపేయండి ప్లీజ్‌