డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి.. ఈ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎనిమిదో వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. 15 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులతో కలిపి 22 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
భరణి మళ్లీ హౌస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో రీతూ చౌదరి, భరణి దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా.. ఇలా మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ తాజాగా ముగిసింది. ఈసారి నామినేషన్స్ లో చాలా ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తను తండ్రిలా భావించే భరణిని తనూజ నామినేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్. .ఇలా వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా మొదలైపోయింది. ఓటింగ్ సరళిన పరిశీలిస్తే.. గత కొద్దిరోజులుగా హౌస్ లో ఇరగ దీస్తోన్న తనూజ ఇప్పుడు కూడా టాప్ ప్లేస్ కొనసాగుతోంది. ఆ తర్వాత సెకెండ్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ పడాల ఉన్నాడు. మూడో ప్లేస్ లో సంజనా గల్రానీ, నాలుగు, ఐదు ప్లేసుల్లో సాయి శ్రీనివాస్, భరణి కొనసాగుతున్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అయితే ఈ వారం ఓటింగ్ కు చాలా సమయం ఉంది. ఇలోపు ఓటింగ్ లో మార్పులు రావచ్చు. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వక తప్పదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TRP కోసం మరీ ఇంత నీచమా..! బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు
‘చికిరి లాంటి అమ్మాయి.. బీడీ కాలుస్తూ.. కొండకోనల్లో అబ్బాయి !!’ పాట అర్థం చెప్పిన బుచ్చిబాబు
మమ్మల్ని మా ఇంటికి పంపేయండి ప్లీజ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

