ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్‌ వండేస్తున్నారు !! వీడియో

|

Mar 10, 2022 | 9:00 PM

తమిళనాడులో విచిత్ర పొంగల్‌ మొక్కుబడి కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. కడలూరు జిల్లా వేప్పూర్ సమీపంలోని చేపాక్కం గ్రామంలో అంగళఅమ్మన్ ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

తమిళనాడులో విచిత్ర పొంగల్‌ మొక్కుబడి కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. కడలూరు జిల్లా వేప్పూర్ సమీపంలోని చేపాక్కం గ్రామంలో అంగళఅమ్మన్ ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో మొక్కులు నెరవేర్చుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. సంతానం లేని వారికీ, అస్వస్థత ఉన్నవారికీ, తీరని కోర్కెలు తీరాలంటే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు. ఈ క్రమంలో భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం అందరిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ముందుగా తలకు చుట్టూ ఒక వస్త్రాన్ని కట్టుకొని దాన్ని తగలబెడతారు. ఆ మంటలలో ఒక పాత్రని నెత్తిపై పెట్టుకొని అందులో పొంగల్‌ని పొంగేవరకు ఉడికిస్తారు. సుమారు 10 నిమిషాలపాటు ఆ మంటల్లోనే భక్తులు తమ నెత్తిన పాత్ర పెట్టుకొని యాత్రగా వస్తారు.

Also Watch:

Viral Video: పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ !! చూస్తే షాకవుతారు !! వీడియో

అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో

తల్లి పాలు డేంజర్‌ అంటున్న పరిశోధకులు !! వీడియో

జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో