రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన పోలీసుల కారు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Updated on: Jun 07, 2025 | 12:56 PM

రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. చట్టం ఎంత చెప్పినా.. తరచుగా డ్రైవర్లు, రైడర్లు ఏమాత్రం పట్టించుకోరు. నిత్యం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఏకంగా ట్రాఫిక్ పోలీసులే రాంగ్‌రూట్‌లో మహీంద్రా బొలెరో కారుతో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

వన్-వేలో తప్పు అని తెలిసి కూడా అటు వైపు నడుపుతూ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియోలో, ట్రాఫిక్ పోలీసుల వన్-వే రోడ్డులో తప్పు వైపుగా వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించినప్పటికీ, బొలెరో ట్రాఫిక్‌కు ఎదురుగా వెళుతూనే ఉంది. TNRTC బస్సు, తన రూట్లో సరిగ్గా వస్తుంది. అయినప్పటికీ బోలెరో వాహనం ఎదురుగా దూసుకుపోతూనే ఉంది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఆలస్యంగా బ్రేక్ వేసి SUVని ఢీకొట్టాడు. ఇదంతా చూస్తుంటే, బస్సు డ్రైవర్ తప్పు చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బ్రేక్ వేసి ఉండవచ్చని ఈ వీడియోలో స్పష్టమవుతోంది. బొలెరో వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతూ నడిపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీన్నంతటిని సర్వీస్ రోడ్డులో వెళ్తున్న ఓ యువకుడు తన సెల్‌ఫోన్ రికార్డ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చెంది. బస్సు వేగంగా వస్తున్నట్లు చూసి, బొలెరో డ్రైవర్ బ్రేకులను వేశాడు. SUV వేగం తగ్గి వెంటనే పూర్తిగా ఆగిపోయింది. మరోవైపు, బస్సు ఆలస్యంగా బ్రేకులు వేసి, బొలెరో ముందు భాగాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదీ కాస్త వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ పాటించాల్సిన వ్యక్తులే, ఇలా తప్పు దారిలో వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తూ నెటిజన్లు సదరు పోలీసులను ఏకీపారేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మట్టి తవ్వుతుండగా ఏదో శబ్దం.. ఇంకాస్త లోతుగా తవ్వగా.. ఆశ్చర్యకరంగా

మృత్యుంజయులు.. వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిన కారు

నిద్రపోదామని రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. దిండుకింద ఏదో కదలిక.. చూస్తే

చేపలు నడవడం చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

కొబ్బరి నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్‌!