Summer Tips : ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

|

Apr 17, 2024 | 3:56 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంటినుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంటినుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత, వడగాలుల సమయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.

అత్యంత అవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. అలా తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వాంతులు ఇతర సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇక ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలపై తప్పక టోపీ ధరించడం, లేదా రుమాలు కట్టుకోవాలని సూచించారు. తెల్లని రంగు కలిగిన కాటన్‌ వస్త్రాలు మాత్రమే ధరించండి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే మంచినీరు గానీ, నిమ్మరసం, కొబ్బరి నీరు గానీ తాగండి. వడదెబ్బకు గురైనవారు సాధారణ స్థితికి రానట్లయితే చల్లటి వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీరు తాగించండి. ఓఆర్‌ఎస్‌, ఇంట్లో తయారుచేసే లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటివి పానీయాలు తీసుకోండి. ఇవి శరీరాన్ని తిరిగి హైడ్రేట్‌ చేయడానికి సహాయపడతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us on