Pregnant Teacher: ఇదేం పోయేకాలం రా మీకు..! గర్భిణీ అని చూడకుండా.. టీచర్‌పై స్టూడెంట్స్‌ గ్యాంగ్‌ దాష్టీకం..!

|

Dec 05, 2022 | 8:36 AM

మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని నేర్చుంటాం. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానం గురువులది. వారు అందించిన విద్య, విజ్ఞానమే భావితరాలకు బంగారు బాట. కానీ,


మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని నేర్చుంటాం. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానం గురువులది. వారు అందించిన విద్య, విజ్ఞానమే భావితరాలకు బంగారు బాట. కానీ, ఇక్కడ మాత్రం దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఒకటి అస్సాంలో వెలుగుచూసింది. ఓ ఉపాధ్యాయురాలిని అవమానించి, దాడి చేశారు విద్యార్థులు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు కొందరు విద్యార్థులు. బాధిత మహిళా టీచర్‌ 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా దాష్టీకానికి పాల్పడ్డారు. దిబ్రూఘర్‌లోని మోరన్ సబ్ డివిజన్‌లోని దోమర్దలాంగ్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు విద్యార్థులపై ఉపాధ్యాయురాలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆమెను రీప్లేస్ చేయడానికి 22 మంది విద్యార్థులు మహిళా ఉపాధ్యాయురాలిపై గ్యాంగ్ కట్టారు. ఈ క్రమంలోనే నవంబర్ 27న తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులు గర్భిణీ టీచర్‌ను విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులైన విద్యార్థులను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 05, 2022 08:36 AM