Super kids: ఈ చిన్నారులు చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..! చిన్న వయస్సులో పెద్ద ఆలోచన.. వీడియో.
ద్దరుచిన్నారులు స్కూలు బ్యాగులు వేసుకొని రోడ్డుపై నడిచి వెళ్తున్నారు. ఇంతలో వారికి దారిలో రోడ్డుపైన ఓ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండటం కనిపించింది. ఆ మ్యాన్‌హోల్ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూశారు.
ద్దరుచిన్నారులు స్కూలు బ్యాగులు వేసుకొని రోడ్డుపై నడిచి వెళ్తున్నారు. ఇంతలో వారికి దారిలో రోడ్డుపైన ఓ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండటం కనిపించింది. ఆ మ్యాన్‌హోల్ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూశారు. అది చాలా లోతుగా ఉన్నట్లు గుర్తించారు. అది అలా తెరిచి ఉండటం ప్రమాదమని గుర్తించిన ఆ చిన్నారులు వెంటనే రోడ్డు పక్కన ఉన్న రాళ్లను తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌కు ఇరువైపులా ఉంచారు. అదే సమయంలో.. చాలా మంది కారులో ఆ రోడ్డుమీద వెళ్తూనే ఉన్నారు. ఎవరూ కారు ఆపడం కానీ.. ఆ చిన్నారులకు సాయం చేయడం కానీ చేయలేదు. కనీసం పిల్లలు రోడ్డుమీద ఏమి చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు, మీరు చేసే పనిలో వైవిద్యం చూపడానికి వయసుతో పనిలేదు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘పిల్లలు సంస్కారవంతులు’ అని కొందరు, ‘పిల్లలు భగవంతుని స్వరూపం’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

