Strange noises Video: ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. సీన్ చూసి ఖంగు తిన్న సిబ్బంది.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
సాధారణంగా బట్టలు కొనడానికి షోరూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ట్రయల్ వేసుకోడానికి సెపరేట్ రూమ్స్ ఉంటాయి. కస్టమర్లు తాము కొన్న బట్టలు ట్రయల్ రూమ్‌కి వెళ్లి ట్రయల్ వేసి చూసుకుంటుంటారు. అలాంటి ట్రయల్ రూమ్‌లోంచి వితం శబ్ధాలు రావడం గమనించారు సిబ్బంది. అయితే....
సాధారణంగా బట్టలు కొనడానికి షోరూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ట్రయల్ వేసుకోడానికి సెపరేట్ రూమ్స్ ఉంటాయి. కస్టమర్లు తాము కొన్న బట్టలు ట్రయల్ రూమ్‌కి వెళ్లి ట్రయల్ వేసి చూసుకుంటుంటారు. అలాంటి ట్రయల్ రూమ్‌లోంచి వితం శబ్ధాలు రావడం గమనించారు సిబ్బంది. అయితే అందులో ఎవరోదాక్కున్నారని అంతా అనుకున్నారు. కానీ ఆశబ్దాలు వస్తున్నదగ్గర పరిశీలించిన వాళ్లు భయంతో వణికిపోయారు. ఎందుకంటే అక్కడ ఓ భారీ పాము వారికి కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బట్టల దుకాణంలో ట్రయల్ రూంలోని టాప్‌లో ఓ భారీ పాము దాక్కుని ఉంది. వెంటనే రెస్క్యూ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు సిబ్బంది. ఈ రెస్క్యూ టీమ్ ట్రయల్ రూమ్‌లోని సీలింగ్‌లో దాక్కున్న ఓ భారీ కొండచిలువను కనిపెట్టారు. ఆపాము అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. పామును పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి పై కూడా ఆ పాము దాడికి ప్రయత్నించింది. అయినా రెస్క్యూ టీమ్ ఎంతో చాకచక్యంగా పామును లొంగదీసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను తన పోస్ట్ ద్వారా షేర్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ గామారింది. ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అలాగే ట్రయల్ రూమ్‌కి వెళ్లినప్పుడు చుట్టూ ఒకసారి చెక్‌చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…