Block Snow Viral Video: రష్యాలో వింత ఘటన.. ఇంతకాలం తెల్లగా కురిసిన మంచు ఇప్పుడు నల్లగా పడుతుంది..(వీడియో)

|

Feb 12, 2022 | 9:43 AM

చలికాలంలో శీతల గాలులతో చలి వేధించినా.. తెల్లగా కురిసే మంచును చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. నేల, చెట్లు అన్నీ తెల్లని మంచుతో నిండిపోయి.. .సూర్యకాంతిలో ఆ మంచు మెరుస్తూ ఉంటే చూడ్డానికి ఎంతో బావుంటుంది. అయితే ఇప్పటి వరకు మనం తెల్లని మంచు మాత్రమే చూశాం. కానీ


చలికాలంలో శీతల గాలులతో చలి వేధించినా.. తెల్లగా కురిసే మంచును చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. నేల, చెట్లు అన్నీ తెల్లని మంచుతో నిండిపోయి.. .సూర్యకాంతిలో ఆ మంచు మెరుస్తూ ఉంటే చూడ్డానికి ఎంతో బావుంటుంది. అయితే ఇప్పటి వరకు మనం తెల్లని మంచు మాత్రమే చూశాం. కానీ ఒక దేశంలో మంచు మాత్రం నలుపురంగులో కురుస్తోంది. కొన్ని అడుగుల మందంతో అక్కడ నల్లని మంచు కురుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ వింత సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. నిజానికి అక్కడ ఓ మారుమూల ప్రాంతంలో కాలుష్యం కారణంగా నల్లని మంచు కురుస్తోందట. అందువల్లనే తెల్లటి మంచు పడటానికి బదులుగా, నల్లని మంచు పడుతోంది. ఈ దేశానికి చెందిన సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో నల్లని మంచు కురుస్తోంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. నిజానికి.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తుంది. దీంతో మసి, దుమ్ము వల్ల కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న నల్లని మంచుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 21వ శతాబ్దంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది దీనిని బట్టి తెలుస్తోందని, 2019లో కూడా ఈ విధంగానే నల్లని మంచు కురిసిందని అక్కడి స్థానికులు తెలిపారు. మరోవైపు దశాబ్ధాలుగా తమ పిల్లలు నల్లని పొగను పీల్చుతున్నారని, ఇక్కడి పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు.