మాయం కానున్న నక్షత్రాలు.. ఇప్పుడే తనివితీరా చూసేయండి

|

Jun 03, 2023 | 9:47 PM

రాత్రివేళ రిలాక్స్‌ కోసం మేడపైకి వెళ్లి ఆకాశంలోకి చూస్తూ నిలబడితే.. వేల వేల నక్షత్రాలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. వేల నక్షత్రాల నడుమ జాబిల్లి ఎంతో అందంగా కనిపిస్తాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఈ అద్భుత దృశ్యం ఇక కనిపించదంటున్నారు శాస్త్రవేత్తలు.

రాత్రివేళ రిలాక్స్‌ కోసం మేడపైకి వెళ్లి ఆకాశంలోకి చూస్తూ నిలబడితే.. వేల వేల నక్షత్రాలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. వేల నక్షత్రాల నడుమ జాబిల్లి ఎంతో అందంగా కనిపిస్తాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఈ అద్భుత దృశ్యం ఇక కనిపించదంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్ తరాల వారు నక్షత్రాలను చూడలేరని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే.. భూ ఉపరితలంలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. కాంతి కూడా ఎక్కువవుతోంది. అందువల్లే ఓ 20 సంవత్సరాల తర్వాత నక్షత్రాలు కనిపించవు అంటున్నారు. ది గార్డియన్ నివేదిక ప్రకారం…. బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్ రీస్… “కాంతి కాలుష్యం కారణంగా సంవత్సరాలు గడిచేకొద్దీ… నక్షత్రాలు తక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. పెరుగుతున్న LEDలు, ఇతర కాంతి వనరుల వల్ల… రాత్రివేళ కూడా భూ ఉపరితలంపై కాంతి ఎక్కువవుతోందని, ఇది ఇలాగే పెరుగుతూ ఉంటే.. భవిష్యత్ తరాల వారికి ఆ కాంతిలో నక్షత్రాలు కనిపించవు అంటున్నారు. జర్మన్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్‌కు చెందిన క్రిస్టోఫర్ కాబా ప్రకారం… ఆకాశంలో నక్షత్రాల మెరుపు… భూమిపై నుంచి చూసేవారికి క్రమంగా తక్కువగా కనిపిస్తోంది. భూమిపై నుంచి ఇప్పుడు 500 నక్షత్రాలు చూడగలిగేవారికి… 18 ఏళ్ల తర్వాత… 200 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయని కాబా అంచనా వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్కల కోసం స్పెషల్‌ ఊయల.. కిర్రాక్‌ ఐడియా..

ఈ రాయిని మండించండి.. వైఫై సిగ్నల్‌ తన్నుకుంటూ వస్తుంది

30 లక్షలమందిని ఇంప్రెస్‌ చేసిన దోశ.. తింటే వదలరు

యవ్వనం కోసం కోట్లు ఖర్చుచేయక్కర్లేదు.. కేవలం ఈ గదిలోకి వెళ్తే చాలు

35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..