పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో

Updated on: Aug 07, 2025 | 10:10 AM

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఒక పాత శిథిలావస్థలో ఉన్న కారుకు సంబంధించినది. దీనిని గత కొన్ని సంవత్సరాలుగా గ్యారేజీలోనే వదిలేశారు. అయితే, ఉన్నట్టుండి ఆ కారు నుండి వింత శబ్దాలు రావటం గ్యారేజీ సిబ్బంది గమనించారు. ఇటీవలి కాలంలో తరచూ కారులోంచి వింతగా శబ్ధాలు వస్తున్నాయి. జుయ్యిమంటూ రాత్రి పగలు తేడా లేకుండా అందరినీ కంగారు పెట్టేస్తున్నాయి ఆ శబ్ధాలు.. దాంతో కారులో ఏముందో చూసేందుకు కారు డోర్‌ ఓపెన్‌ చేశారు… అది తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

చాలా కాలంగా కారును అలాగే వదిలేయటంతో లోపల తేనెటీగలు ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాయి. దాని గురించి ఎవరికీ తెలియదు. భారీ సైజులో ఉన్న ఆ తేనెతుట్టే నిండా ఈగలు లక్షల్లో ఉన్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా సంవత్సరాలుగా కారును పట్టించుకోక పోవడంతో ఏ ఎలుకలో చేరి ఉంటాయి.. ఆ శబ్ధాలు అవే అయి ఉంటాయని గ్యారేజ్ యజమాని మొదట్లో లైట్‌ తీసుకున్నాడు. కానీ, రోజు రోజుకీ ఆ శబ్ధాలు వింతగా వినిపిస్తుండటంతో కార్‌ డోర్‌ ఓపెన్ చేసినప్పుడు అసలు మ్యాటర్‌ తెలిసింది. వెంటనే తేనెటీగల పెంపకం దారుడికి సమాచారం అందించారు. అతను తేనెటీగలను జాగ్రత్తగా తొలగించి తేనెటీగలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో వీడియో చూసిన ప్రతిఒక్కరూ దీనిపై స్పందించారు. కొంతమంది వినియోగదారులు దీనిని ప్రకృతి అద్భుతం అని, మరికొందరు దీనిని భయానకంగా ఉందని చెప్పారు. వామ్మో ఇప్పుడు నేను గ్యారేజ్ తెరవడానికి ముందు పదిసార్లు ఆలోచిస్తాను అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. తేనెటీగల పెంపకందారుడిని చాలా మంది ప్రశంసించారు.

మరిన్ని వీడియోల కోసం:

ఏటీఎంలో మనీ కాదండోయ్ బుసలు కొట్టే నాగుపాము.. వీడియో చూస్తే వణకాల్సిందే !

షాకింగ్ : హీరోయిన్ బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ వీడియో

ఏం సినిమా రా బాబూ.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్ వీడియో