ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభం జరుగుతుంది?
మనం వేసుకునే బట్టలు కూడా మనపైన ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? జ్యోతిష పండితులు ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం అధిపత్యం వహిస్తాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఇష్టమైనదిగా చెబుతారు. ఉదాహరణకు బుధునికి ఆకుపచ్చరంగు, చంద్రుడికి తెలుపు రంగు ఇలా ప్రతి గ్రహానికి కొన్ని రంగులు చెప్పారు. ఆయా రోజుల్లో ఆ రంగు దుస్తులు ధరించడం ద్వారా గ్రహాలు వారిపై సానుకూల ప్రభావం చూపుతాయని, అదృష్టం కలిగిస్తాయని చెబుతారు. అయితే ఏరోజు ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు చూద్దాం!
సోమవారానికి చంద్రుడు అధిపతిగా చెబుతారు. చంద్రగ్రహం శాంతి, స్వచ్ఛత, భావోద్వేగాలకు ప్రతీక. ఈ రోజున తెలుపు, క్రీమ్, లేదా సిల్వర్ కలర్ దుస్తులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుందని చెబుతారు. ఇది కొత్త వారాన్ని ప్రశాంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. మంగళవారానికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా చెబుతారు. ఈ గ్రహం శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాలకు ప్రతీక. ఈ రోజున ఎరుపు, కోరల్, లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించడం వల్ల ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఇది సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.బుధవారానికి అధిపతి బుధుడుగా చెబుతారు. బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, వాణిజ్యానికి ప్రతీక. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయి. ఇది ముఖ్యమైన సమావేశాలకు లేదా పరీక్షలకు వెళ్లేవారికి మంచిది. గురువారానికి అధిపతి బృహస్పతి అంటే గురుగ్రహంగా చెబుతారు. గురువు జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీక. ఈ రోజున పసుపు, నారింజ లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల అదృష్టం, విజయం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయి. శుక్రవారానికి అధిపతి శుక్రుడుగా చెబుతారు. శుక్రుడు ప్రేమ, అందం, కళలకు ప్రతీక. ఈ రోజున గులాబీ, తెలుపు, లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల మీపై ఇతరులకు ఆకర్షణ పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. శనివారానికి అధిపతి శని గ్రహంగా చెబుతారు. శని క్రమశిక్షణ, కర్మ, కష్టాలకు ప్రతీక. ఈ రోజున నలుపు, ముదురు నీలం, లేదా ఊదా రంగు దుస్తులు ధరించడం వల్ల ధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. ఆదివారానికి అధిపతి రవి. సూర్యుడు శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి ప్రతీక. ఈ రోజున ఎరుపు, కాషాయం లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, రోజు ఉత్సాహంగా సాగుతుంది. ఈ రంగులు సూర్య శక్తిని గ్రహించడానికి సహాయపడతాయి.
మరిన్ని వీడియోల కోసం:
ఏటీఎంలో మనీ కాదండోయ్ బుసలు కొట్టే నాగుపాము.. వీడియో చూస్తే వణకాల్సిందే !
షాకింగ్ : హీరోయిన్ బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ వీడియో
ఏం సినిమా రా బాబూ.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్ వీడియో
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
కస్టమర్లా వచ్చాడు.. షాపులో ఒంటరిగా ఉన్న మహిళను అదను చూసి..
వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్ ఆడుకున్నాడుగా!
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి 'సుపారీ'

