ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే

Updated on: May 13, 2025 | 6:32 PM

సాధారణంగా వర్షా కాలంలో ఉరుములు మెరుపులతో వానపడటం సహజం. ఒక్కోసారి ఈ ఉరుములు మెరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. పెద్ద పెద్ద శబ్ధాలతో ఉరుములు ఉరుముతాయి. అలాంటప్పుడు ఎంతటి ధైర్యవంతులైనా భయపడతారు. మరీ పిరికివారు అర్జునా ఫల్గుణా.. అర్జునా ఫల్గుణా అంటూ నామజపం చేస్తారు.

ఇళ్లలో సురక్షితంగా ఉండే మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక చెట్లుచేమలపై ఉండే మూగజీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితే ఓ ఉడుతకు ఎదురైంది. అప్పుడు ఆ ఉడుత ఏంచేసిందో చూస్తే అవాక్కవుతారు. ఓ ఉడుత ఓ చెక్క బాక్స్‌లో పడుకుని హాయిగా నిద్రపోతుంది. అదే సమంలో బయట పెద్దగా వర్షం పడుతోంది. అయినా ఉడుత చెక్కపెట్టెలో భద్రంగా ఉంది. చుక్కనీరుకూడా లోపలికి వెళ్లలేదు. దీంతో బేఫికర్‌ గా నిద్రపోతోంది. ఇంతలో పెద్ద ఉరుము ఉరిమింది. దెబ్బకు ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఉడుత. తు..తు.. అంటూ గుండెలమీద చేత్తో రాసుకుంటూ…అమ్మబాబోయ్‌… ఎంత పెద్ద ఉరుము.. ఎక్కడో పిడుగుపడినట్టుంది… ఇంకా నయం నా ఇంటిపైన పడలేదు అర్జునా..ఫల్గుణా అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ అలా చాలాసేపు గుండెలపై చేత్తో రాసుకుంటూ మళ్ళీ ఎక్కడ ఉరుముతుందోనని ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. అలా కూర్చునే కాసేపటికి నిద్రలోకి చారుకుంది. ఉడుత ఎదురుగా ఎదురుగా ఎవరో కెమెరా ఏర్పాటు చేయడంతో ఈ వింత ఎక్స్‌ప్రెషన్ మొత్తం రికార్డ్ అయింది. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయ్యో ఉడుత కలలన్నీ చెదిరిపోయాయే అని కొందరు .. ఉడుత ఎక్స్‌ప్రెషన్స్‌ మామూలుగా లేవంటూ ఇంకొందరు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 8 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 2 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ??

సింహాల గుంపులోకి ఏనుగు ఎంట్రీ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

ఈ డైట్‌ ఫాలో అయితే.. మీ కిడ్నీలకు ఢోకా ఉండదు

ఈ జ్యూస్‌ రోజుకి ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి

తల్లీ, కూతుళ్ల ప్రాణం తీసిన ఎయిర్‌ కూలర్‌