దారిచ్చే సముద్రం చూసారా? ఏటా రెండుసార్లు.. ఎక్కడంటే వీడియో

Updated on: Aug 31, 2025 | 8:18 PM

సముద్రం రెండుగా చీలిపోయే దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? హాలీవుడ్ సినిమా టెన్ కమాండ్‌మెంట్స్ లో ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం ఓ అద్భుతం. ఆ సినిమా విజువల్ వండర్ గా ఖ్యాతికి ఎక్కింది. సెసిల్ బి.డెమిల్ 1956లో తీసిన ది టెన్ కమాండ్‌మెంట్స్ చిత్రంలో ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయే సన్నివేశం ఉంటుంది. నీరు ప్రవహిస్తున్న ఫుటేజ్ రివర్స్ చేయడం, వారి నీటి ట్యాంకులతో అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ ను సృష్టించడం వంటివి చేశారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దక్షిణ కొరియాలోని జిండో సముద్రంలోనేదే. అక్కడ అరుదైన ప్రకృతి వింత కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో సముద్రం రెండు భాగాలుగా విడిపోయి ఒక అద్భుతమైన ఇసుక దారినేర్పరుస్తుంది. ఈ అసాధారణ దృశ్యం జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు కనిపిస్తుంది.

సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంట సేపు కనిపించే ఈ బ్రిడ్జి పై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్ళొచ్చు. ఈ ప్రకృతి వింత దేశ విదేశీ యాత్రికులను ఆకర్షిస్తుంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వేలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఈ ఇసుక దారి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉంటుంది. అయితే ఈ అద్భుత దృశ్యం కేవలం ఒక గంట పాటు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత సముద్రం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక దృశ్యం సంవత్సరం లోని నిర్ధిష్ట సమయాల్లో ముఖ్యంగా వసంత ఋతువులో అంటే మార్చి నుంచి జూన్ మధ్యలో సంభవిస్తుంది. ఆటుపోట్లు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ అరుదైన సహజ సంఘటనను ఆస్వాదించడానికి స్థానికులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో జిండోకు చేరుకుంటారు. ఈ సమయంలో స్థానికులు జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో సాంప్రదాయ సంగీత ప్రదర్శనలు, సముద్ర దారిపై నడిచే అవకాశం వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ దారిపై నడవడం ఒక అద్భుతమైన అనుభవంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రకృతి అసాధారణ శక్తికి ఇది నిదర్శనం.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో