బొద్దింకను చంపబోయి.. అపార్ట్‌మెంట్‌కే నిప్పటించింది
ఒక్కోసారి ఏం కాదులే అని మనం అనాలోచితంగా చేసే పనులు ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయో తాజాగా దక్షిణ కొరియాలో జరిగిన ఉదంతమే ఓ పెద్ద ఉదాహరణ. అందుకే ఏ పనైనా చేసే ముందు ఒకట్రెండు సార్లు ఆలోచించాలంటారు పెద్దలు. ఒసాన్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చూసి కంగారుపడింది ఓ మహిళ. బొద్దింకపై మండే స్వభావం ఉన్న స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్‌తో నిప్పంటించింది.
ఆమె బొద్దింకను చంపేందుకు మండే స్వభావం ఉన్న స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్‌తో నిప్పంటించింది. ఆ బొద్దింక కాలిపోతూ ఇంట్లోని సామాగ్రి కిందకు వెళ్లడంతో మంటలు అంటుకున్నాయి..ఆ మంటలు కాస్తా వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి పక్కింటి అపార్ట్‌మెంట్ మంటల్లో చిక్కుకుంది. దీంతో.. రెండు నెలల శిశువునుతో బాటు అదే ఫ్లోర్‌లో పొరుగున ఉండే మరో జంట.. ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో, వారు ముందుగా తమ బిడ్డను పక్కింటి వారికి కిటికీ గుండా అప్పగించారు. తాము కూడా కిందికి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తున్న భార్య పట్టు తప్పి ఐదో ఫ్లోర్ నుంచి కిందకు పడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించింది. మంటలు గ్రౌండ్‌ఫ్లోర్‌కు వ్యాపించి అక్కడున్న వాణిజ్య యూనిట్లు కాలిపోయాయి. కొన్ని కుటుంబాల్లో ఎనిమిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇన్ని ప్రమాదాలకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలయ్యే పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ యువతి చనిపోగా,అపార్టుమెంటులో మంటలు, పొగ కారణంగా మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర తీరంలో భారీ కళేబరం.. దగ్గరికెళ్లి చూస్తే
వాట్సాప్ కీలక అప్‌డేట్… ఇకపై చాట్ జీపీటీ పని చేయదు
రాబోయేది మినరల్ వార్.. రంగంలోకి భారత్.. చైనాకు చెక్
