Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

|

Jun 01, 2022 | 8:57 AM

పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు.. .కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ, సారీ నామ జపం విన్నారా..? కానీ, ఓ చోట స్కూల్‌ ఆవరణ, పాఠశాల గోడలు, లోనికి వెళ్లే మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ, సారీ అని రాసి...

YouTube video player
పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు.. .కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ, సారీ నామ జపం విన్నారా..? కానీ, ఓ చోట స్కూల్‌ ఆవరణ, పాఠశాల గోడలు, లోనికి వెళ్లే మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ, సారీ అని రాసి ఉండటం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.బెంగళూరులోని సుంకడకట్టే ప్రాంతంలో శాంతిధామ పాఠశాల దాని చుట్టుపక్కల వీధుల్లో ఎరుపు రంగులో ‘సారీ.. సారీ.. సారీ` అనే రాయడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను, పాఠశాల అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. స్కూల్‌ ఎంట్రెన్స్‌ నుండి మొదలు పెడితే…, గోడలు, మెట్లపై సారీ.. సారీ.. సారీ అని కొందరు ఆకతాయిలు రాశారు. చుట్టుపక్కల వీధుల్లో అలాగే రాశారు. ఇదంతా చూసిన స్థానికులకు ఏమీ అర్థం కాలేదు.. వెంటనే స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు యువకులు సారీ.. సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Published on: Jun 01, 2022 08:57 AM