Viral: 20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?

|

Nov 29, 2023 | 7:00 PM

గత 20 ఏళ్లుగా ఓ యువకుడిని సంకెళ్లతో చెట్టుకు కట్టి బంధించారు అతడి తల్లిదండ్రులు. మానసిక అనారోగ్యం కారణంగా గత 20 ఏళ్లుగా సంకెళ్లతో జీవిస్తున్నాడు బంగాల్​కు చెందిన ఓ యువకుడు. అతడికి వైద్యం చేయించే స్థోమత లేక.. అలానే వదిలేస్తే ఎక్కడ పారిపోతాడననే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు. ఎట్టకేలకు మాల్జా మేజిస్ట్రేట్​ నితిన్​ సింఘానియా..

గత 20 ఏళ్లుగా ఓ యువకుడిని సంకెళ్లతో చెట్టుకు కట్టి బంధించారు అతడి తల్లిదండ్రులు. మానసిక అనారోగ్యం కారణంగా గత 20 ఏళ్లుగా సంకెళ్లతో జీవిస్తున్నాడు బంగాల్​కు చెందిన ఓ యువకుడు. అతడికి వైద్యం చేయించే స్థోమత లేక.. అలానే వదిలేస్తే ఎక్కడ పారిపోతాడననే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు. ఎట్టకేలకు మాల్జా మేజిస్ట్రేట్​ నితిన్​ సింఘానియా.. యువకుడికి వైద్య సాయం చేస్తామని హామీ ఇవ్వడంతో యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.మాల్దా జిల్లా బరుయిపర గ్రామానికి చెందిన శివశంకర్ రామ్, సుమేధా దేవి​ దంపతుల ఐదో కుమారుడు వరుణ్​ రామ్​ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసి తన తండ్రి దగ్గర పడుకున్నాడు​. ఆకస్మాత్తుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి తన కొడుకు ఇలానే మానసికంగా బాధపడుతున్నాడని వరుణ్​ తల్లి చెబుతోంది.

చిన్నప్పుడు వరుణ్ బాగానే ఉండేవాడని ఎనిమిదేళ్ల వయసు నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని తల్లి సుమేధా దేవి తెలిపింది. అప్పటి నుంచి వరుణ్​ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదనీ వదిలేస్తే పారిపోయేవాడనీ ఇంటి నుంచి తప్పించుకొని ఎక్కడ సరిహద్దు దాటి వెళ్తాడోనని భయంతో చెట్టుకు బంధించి ఉంచుతున్నామని అన్నారు. గతంలో ఒకసారి ఇలానే తప్పిపోయాడనీ అప్పడు వరుణ్​ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. కూలీ పనులు చేసుకునే తమ దగ్గర వరుణ్​కి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఇలా గత 20 ఏళ్లుగా బంధించి ఉంచామనీ తాము పనికి వెళ్తే తమ కుమార్తె వరుణ్​ను చూసుకుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో వరుణ్​కి వైద్యం చేయించడానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని తండ్రి శివశంకర్ రామ్‌ చెప్పాడు. ఇటీవల మనోజ్​ మందల్ అనే పంచాయతీ సభ్యుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మాల్దా జిల్లా మేజిస్ట్రేట్​ నితిన్​ సింఘానియా వరుణ్​కు వైద్యం చేయించేందుకు అవరసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.