వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్‌ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు

Updated on: Feb 26, 2025 | 4:32 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లో బంధించి, ఇంటికి తాళం వేసి.. భార్య పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్‌ తినేందుకు కూడా ప్రయత్నించింది.

ఈ షాకింగ్‌ సంఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో నివాసం ఉంటున్న అఖిలేష్ ప్రజాపతి తన తల్లి సంజు దేవిని ఇంట్లోనే ఉంచి ఫిబ్రవరి 17న తాళం వేశాడు. అనంతరం తన భార్య, పిల్లలతో కలిసి ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాడు. వృద్ధురాలు మూడు రోజుల పాటు కుమారుడు ఇంట్లో ఉంచిన అన్నం, నీళ్లతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత తినేందుకు ఏమీ లేకపోవడంతో ఆకలి తట్టుకోలేకపోయింది. చివరకు ప్లాస్టిక్‌ తినేందుకు కూడా ఆమె ప్రయత్నించింది. ఆకలికి తట్టుకోలేక కేకలు వేయడంతో.. ఆమె అరుపులు విన్న స్థానికులు ఆమె కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు. చాందినీ దేవి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి, భోజనం పెట్టి, అనంతరం వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ‘ప్రభాస్‌’ పేరుతో ఊరు.. ఖుషీగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ | జస్ట్ మిస్.. లేదంటే.. పుష్ప2 రికార్డ్ బద్దలయ్యేది