Loading video

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

|

Mar 22, 2025 | 1:10 PM

తెలుగు రాష్ట్రాల్లో పాములు హల్‌చల్ చేస్తున్నాయ్. ఒకచోట ఇంట్లో దూరితే.. మరోచోట కారు, బైక్స్‌లో ప్రత్యక్షమై ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వ్యక్తి టూవీలర్‌లో నాగుపాము దూరింది. బైక్ ముందుభాగంలోని డోమ్‌లో పాము బుసలు కొట్టడం చూసి.. చాలాసేపు శ్రమించి బయటకు తీశారు.

విశాఖ పెందుర్తిలో ఇంటి టాయిలెట్‌లో దూరిన నాగుపాము జనాన్ని హడలెత్తించింది. బాత్‌రూమ్‌ కమోడ్‌లో నక్కిన పామును చూసి.. ఇంటి సభ్యులు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన నాగుపామును పట్టుకుని తీసుకెళ్లాడు. మరోవైపు నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలో చేపల వలకు భారీ కొండచిలువ చిక్కింది. వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారులు చేపల కోసం వల వేయగా.. కొండ చిలువ చిక్కడంతో అటవీ అధికారులకు అప్పగించారు. విశాఖలో సరదాగా బీచ్‌కు వెళ్లిన కుర్రాళ్లకు కొండ చిలువ రిటన్ గిఫ్ట్‌గా వచ్చింది. ఇన్నోవా కారు పార్క్ చేసి బీచ్‌లో ఎంజాయ్ చేశాక.. తిరిగి వెళ్దామనే సమయంలో కారు టైర్ దగ్గర కొండ చిలువ ఉన్నట్లు గమనించారు. అర్థరాత్రి సమయంలో స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్‌ వీడియో

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో