Snake Hulchul: ఆస్పత్రిలో ఏడడుగుల పాము..జంకుతున్న జనం
కడపజిల్లా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో సుమారు ఏడు అడుగుల పాము ప్రత్యక్షమైంది.
కడపజిల్లా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో సుమారు ఏడు అడుగుల పాము ప్రత్యక్షమైంది. ఆ పామును చూసిన రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక భయంతో ఆ పామును కొట్టి చంపేశారు. పాము చనిపోయిందని నిర్దారిందుకున్న తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి ఆవరణ చుట్టూ ముళ్ల కంప, పొదలు ఉండటం కారణంగా తరచూ విష సర్పాలు, క్రిమికీటకాలు వస్తున్నాయంటూ ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు వాపోతున్నారు.
