Snake Viral Video: బయటకు వెళ్లేందుకు బైక్‌ తీసిన వ్యక్తి.. అక్కడి సీన్‌ చూసి దెబ్బకు షాక్‌.. ఇంత పెద్దదా..!

|

Aug 17, 2022 | 6:31 PM

పనిమీద బయటకు వెళ్లేందుకు అతను బైక్‌ తీశాడు. ఇక బైక్‌ స్టార్ట్‌ చేద్దామనుకునే సమయానికి బైక్‌ డూమ్‌లోంచి ఏదో శబ్దం రావడం గమనించాడు. ఏంటని పరిశీలించగా అందులో ఓ నాగుపాము చుట్టుకొని ఉండటం గమనించాడు.

Viral : బయటకు వెళ్లేందుకు బైక్‌ తీసిన వ్యక్తి.. అక్కడి సీన్‌ చూసి దెబ్బకు షాక్‌ @TV9 Telugu Digital
పనిమీద బయటకు వెళ్లేందుకు అతను బైక్‌ తీశాడు. ఇక బైక్‌ స్టార్ట్‌ చేద్దామనుకునే సమయానికి బైక్‌ డూమ్‌లోంచి ఏదో శబ్దం రావడం గమనించాడు. ఏంటని పరిశీలించగా అందులో ఓ నాగుపాము చుట్టుకొని ఉండటం గమనించాడు. దెబ్బకు షాకైన వ్యక్తి భయంతో స్థానికులను పిలిచాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. తర్వాత బైక్‌ మెకానిక్‌ను పిలిచి అతని సాయంతో డూమ్‌ను విప్పగా పాము ఒక్క ఉదుటన బయటపడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరులో జరిగింది. స్థానిక వీఆర్‌ఏ రఘు అనే వ్యక్తి బైక్‌లో చేరిన పాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వర్షాకాలం కావడంతో పాములు ఇళ్లలోకి వస్తాయని, ఈక్రమంలో వాటికి అనువైన ప్రదేశాల్లో చేరిపోతాయని, అందరు అప్రమత్తంగా ఉండాలని మాజీ ZPTC L.వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..