Loading video

గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో

|

Mar 16, 2025 | 7:53 PM

ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి పాములు. గ్రామాల్లో అయితే ఇవి ఇళ్లలో చొరబడినప్పుడు కోళ్ల గూటిలో చేరి అక్కడ గుడ్లను మింగేస్తుంటాయి. అలా ఓ చోట గుడ్డును మింగిన పాము అక్కడినుంచి బయటకు రాలేక.. ఆ గుడ్డును కక్కలేక... మింగలేక నానా అవస్థలు పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలు, గుడ్లు ఆహారంగా తింటుంటాయి. ఈ క్రమంలో ఓ పాము ఆహారం వెతుక్కుంటూ ఉండగా ఒక బోనులాంటిది దానికి కపించింది. అందులో ఓ కోడి గుడ్డు ఉంది. దానిని చూసిన పాము కళ్లు పెద్దవయ్యాయి. హమ్మయ్య ఇవాళ్టికి దీంతో కడుపు నింపుకోవచ్చు అనుకుంది. క్షణం ఆలోచించకుండా గబగబా ఆ బోనులోకి దూరేసింది. అక్కడ కనిపించిన గుడ్డును గుటుక్కున మింగేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. వచ్చిన పని అయిపోయింది కదా తిరిగి వెళ్లిపోదామని బోనులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇంకేముంది గుడ్డు మింగేయడం వల్ల దాని పరిమాణం పెరిగిపోయి అందులోంచి బయటకు రాలేకపోయింది. పోనీ గుడ్డును బయటకు వదిలేసి వెళ్లిపోదామా అని దానిని కక్కే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చి ఓ వ్యక్తి పాము నోటిలోంచి గుడ్డును బయటకు తీసే ప్రయత్నం చేసాడు. అయితే గుడ్డును వదులుకోవడం ఇష్టం లేని పాము గుడ్డును విడిచిపెట్టకుండా మరింత గట్టిగా పట్టుకుంది. ఈ వీడియో ఇంతవరకే ఉంది. తర్వాత ఏం జరిగిందేనేది తెలియరాలేదు. ఆ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అయింది. ఇప్పటికే కోటిమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. లక్షలాదిమంది లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ కేసులో ఏం జరిగిందంటే వీడియో

అమెరికాలో సుదీక్ష మిస్సింగ్‌.. ఆ బీచ్‌లో ఏం జరిగి ఉంటుంది?వీడియో