బట్టలు ఉతుకుతున్న యువతి.. అంతలోనే ఊహించని షాక్ వీడియో

Updated on: Apr 05, 2025 | 6:01 PM

ఎండలు మండిపోతుండటంతో పాములు చల్లదనం కోసం వెతుక్కుంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసుకొని జనాలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పాముకాట్లకు గురై చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాముకాటుతో ఓ యువతి మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. బట్టలు ఉతుకుతున్న యువతిని పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

 అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన శ్రుతి ప్రియ అనే యువతి ఇంటివద్ద బట్టలు ఉతుకుతుండగా ఏదో కుట్టినట్టు అనిపించింది. ఏమై ఉంటుందా అని చూసే సరికి అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేసింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు ప్రియను రాజోలులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియ మృతిచెందింది. బీఎస్సీ పూర్తి చేసిన శ్రుతి ప్రియ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. వచ్చే ఏడాది ప్రియకు వివాహం చెయ్యాలని భావించిన ఆమె తల్లి మంగాదేవి పని కోసం గల్ఫ్‌కు వెళ్లింది. తల్లి దగ్గరలేని సమయంలో శ్రుతి మరణించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఇటీవల ఈ ప్రాంతంలో రక్తపింజరల సంచారం ఎక్కువైపోయాయని, ఇవి మట్టి రంగులోనే ఉండటంతో గుర్తుపట్టలేక పాముకాట్లకు బలైపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుర్రు గ్రామానికి సమీపంలోనే PCHలో యాంటీ వీనం ఇంజెక్షన్‌ ఉన్నా.. సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే శ్రుతి మరణించిందని వాపోయారు. ప్రతీ గ్రామానికి దగ్గర్లో ఉన్న PHC ఆసుపత్రిలో సిబ్బంది, ఇంజెక్షన్ అందుబాటులో ఉంచి ప్రజలు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో

టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?

తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్‌ కెమెరా వీడియో

ఖతర్నాక్‌ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో


Published on: Apr 05, 2025 06:00 PM