ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు

ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు

Phani CH

|

Updated on: Nov 15, 2022 | 8:03 AM

“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు పెద్దలు. ఇంద్రియాలన్నింటిలో కన్ను అత్యంత ప్రధానం. అంతేకాదు అది అత్యంత సున్నితం కూడా.. అలాంటి కంటిలో చిన్న నలుసు పడితే చాలు ప్రాణం పోతుందా అన్నట్లుగా ఉంటుంది.

“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు పెద్దలు. ఇంద్రియాలన్నింటిలో కన్ను అత్యంత ప్రధానం. అంతేకాదు అది అత్యంత సున్నితం కూడా.. అలాంటి కంటిలో చిన్న నలుసు పడితే చాలు ప్రాణం పోతుందా అన్నట్లుగా ఉంటుంది. ఆ క్షణం విలవిలలాడిపోతాం.. కానీ ఓ చిన్నారి కంటి నుంచి ఏకంగా రాళ్లు, బియ్యం గింజలు బయటపడుతున్నాయి. అయితే గతంలో చాలామంది కళ్లల్లోంచి ఇలా రాళ్లు రావడం సాధారణమే అయినా, ఈ బాలికకు రోజూ రాళ్లు కంటి నుంచి బయటకు వస్తున్నాయి. జోగులాంబ గద్వాలజిల్లా మానవపాడులోని రంగన్న, లక్ష్మి దంపతుల కూతురు దీపాలి. రెండ్రోజుల నుంచి కంటి నొప్పితో తీవ్ర అవస్థలు పడుతోంది. తీరా చూస్తే..కళ్లలోంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. దీంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు స్కానింగ్‌ పరీక్షక్షలు చేసినా.. ఏం లేదని తేల్చేశారు. దాంతో దీపాలిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ప్రతిరోజు పాప కంటి నుంచి 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది వింత అనిపించినా.. ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకాక దీపాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..

బామ్మకు ద‌డ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్

Digital TOP 9 NEWS: మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి.! | ఆ తర్వాత గుండెపోటుతో

TOP 9 ET News: RRR సీక్వెల్‌పై జక్కన్న క్లారిటీ | ఆ తర్వాతే నా పెళ్లి హీరో విశాల్‌ క్లారిటీ

Published on: Nov 15, 2022 08:03 AM