ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??
ఆ రైలు స్వర్గంలోకి పయనిస్తుంది. ఆ ప్రయాణం ఆసాంతం ఆహ్లాదకరం. కానీ రైలు వేగం గంటకు సగటున 9 కిలోమీటర్లు మాత్రమే. ఈ రైలు పేరు నీలగిరి ప్యాసింజర్.
ఆ రైలు స్వర్గంలోకి పయనిస్తుంది. ఆ ప్రయాణం ఆసాంతం ఆహ్లాదకరం. కానీ రైలు వేగం గంటకు సగటున 9 కిలోమీటర్లు మాత్రమే. ఈ రైలు పేరు నీలగిరి ప్యాసింజర్. ఇది తమిళనాడులోని.. మెట్టుపాళ్యం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి ఊటీ స్టేషన్ వరకూ వెళ్తుంది. మెట్టుపాళ్యం – ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు భారతదేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు. ఇది గంటకు సగటున 9 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. భారతదేశంలోని అత్యంత వేగవంతమైన రైలు కంటే.. ఈ వేగం దాదాపు 16 రెట్లు తక్కువ. కెల్లర్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్‌డేల్, ఊటాకామండ్ స్టేషన్లలో ఈ రైలు పయనిస్తుంది. మెట్టుపాళ్యం – ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు కోచ్‌లను.. నీలగిరి కొండల సుందరమైన అందాలను ఆస్వాదించడానికి వీలుగా… భారీ కిటికీలతో నీలం, క్రీమ్ రంగుల కలపతో తయారుచేశారు. మొత్తం 46 కిలోమీటర్ల దూరాన్ని చేరేందుకు ఈ ట్రైన్.. దాదాపు 5 గంటలు తీసుకుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్
మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..
గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??
రాజమౌళికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!