ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు

ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు

Phani CH

|

Updated on: Dec 28, 2023 | 10:14 PM

భక్తులు నాగుపాములు, త్రాచుపాములను దైవంగా భావించి పూజిస్తారు. నాగదేవతగా, సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో భక్తులను అనుగ్రహించేందుకు స్వయంగా సుబ్రహ్మణ్యుడే దిగివచ్చాడా అన్నట్టుగా అక్కడి ఆలయంలో నాగప్రతిమకు చుట్టుకొని త్రాచుపాము పడగవిప్పి బుసలు కొడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఈ వింతఘటనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.

భక్తులు నాగుపాములు, త్రాచుపాములను దైవంగా భావించి పూజిస్తారు. నాగదేవతగా, సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో భక్తులను అనుగ్రహించేందుకు స్వయంగా సుబ్రహ్మణ్యుడే దిగివచ్చాడా అన్నట్టుగా అక్కడి ఆలయంలో నాగప్రతిమకు చుట్టుకొని త్రాచుపాము పడగవిప్పి బుసలు కొడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఈ వింతఘటనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ధనుర్మాసం.. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రంగా చెబుతారు. అందుకే భక్తులు ఈ మాసంలో శైవ, వైష్ణవాలయాలకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి గ్రామంలోని స్వర్ణదుర్గ ఆశ్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అక్కడి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్థానికుడు ఒకరు స్వామి దర్శనానికి వచ్చారు. అక్కడ నాగప్రతిమపై ఓ పెద్ద త్రాచుపాము చుట్టుకొని పడగవిప్పి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే స్థానికులకు విషయం చెప్పారు. దాంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంతసేపైనా పాము ఆ ప్రతిమను వదిలి వెళ్లలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్ధినిపై ప్రిన్సిపాల్‌ లైంగిక దాడికి యత్నం

రన్నింగ్‌లో ఉండగా ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు

ఈ దొంగ రూటే సెపరేటు.. చోరీ చేసి మరీ దానాలు చేస్తాడు !!