విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నం
హాస్టల్ గదిలో నిద్రిస్తున్న విద్యార్థినిపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. అర్ధరాత్రి హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆ స్టూడెంట్ కేకలు వేయగా మిగతా స్టూడెంట్లు నిద్రలేచారు. కోపంతో మండిపడ్డ ప్రిన్సిపాల్.. స్టూడెంట్లపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం చోటుచేసుకుంది.
హాస్టల్ గదిలో నిద్రిస్తున్న విద్యార్థినిపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. అర్ధరాత్రి హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆ స్టూడెంట్ కేకలు వేయగా మిగతా స్టూడెంట్లు నిద్రలేచారు. కోపంతో మండిపడ్డ ప్రిన్సిపాల్.. స్టూడెంట్లపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి వెళ్లిపోయాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్ లో మిగతా స్టూడెంట్లతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో మిగతా విద్యార్థినులు నిద్రలేచి ఆ గదికి వచ్చారు. సురేందర్ గౌడ్ వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో తెల్లవారి వారు హాస్టల్ కు చేరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

