రన్నింగ్‌లో ఉండగా ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు
రన్నింగ్‌లో ఉండగా బైక్ కాస్త స్లిప్ అయితేనే కంగారు పడిపోతాం. అలాంటిది రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సు టైర్లు ఊడిపోతే ఎలాఉంటుంది? సరిగ్గా అదే జరిగింది కరీంనగర్ జిల్లాలో. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి హనుమకొండ కు వెళ్తున్న పల్లె వెలుగుబస్సు వెనుక టైర్లు ఊడి పోయాయి.. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కరీంనగర్ - వరంగల్ మద్య జాతీరహదారిపై ఎల్కతుర్తి వద్ద జరిగింది.
రన్నింగ్‌లో ఉండగా బైక్ కాస్త స్లిప్ అయితేనే కంగారు పడిపోతాం. అలాంటిది రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సు టైర్లు ఊడిపోతే ఎలాఉంటుంది? సరిగ్గా అదే జరిగింది కరీంనగర్ జిల్లాలో. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి హనుమకొండ కు వెళ్తున్న పల్లె వెలుగుబస్సు వెనుక టైర్లు ఊడి పోయాయి.. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కరీంనగర్ – వరంగల్ మద్య జాతీరహదారిపై ఎల్కతుర్తి వద్ద జరిగింది. బస్సు రన్నింగ్ లోనే హఠాత్తుగా రెండు టైర్లు ఊడిపోయి ఆ టైర్లు పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దొర్లుకుంటూ వెళ్లిపోయాయి. ఊహించని ఘటనతో ప్రయాణికులు బిత్తర పోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

