వామ్మో.. దేవుడో.. 16 కీటకాలు తినేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

|

Jul 12, 2024 | 6:51 PM

సింగపూర్​లో కీటకాలను ఆహారంలో భాగం చేసింది అక్కడి ప్రభుత్వం. మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ సహా మొత్తం 16 కీటకాలను ఆహారంగా ఉపయోగించడానికి సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చైనీస్, భారతీయ వంటకాలతో సహా ప్రపంచ ఆహార మెనూలో ఈ కీటకాల జాబితాను చేర్చింది. చైనా, థాయ్ లాండ్, వియత్నాం నుంచి ఈ కీటకాలు సింగపూర్​కు సరఫరా కానున్నాయి.

సింగపూర్​లో కీటకాలను ఆహారంలో భాగం చేసింది అక్కడి ప్రభుత్వం. మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ సహా మొత్తం 16 కీటకాలను ఆహారంగా ఉపయోగించడానికి సింగపూర్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చైనీస్, భారతీయ వంటకాలతో సహా ప్రపంచ ఆహార మెనూలో ఈ కీటకాల జాబితాను చేర్చింది. చైనా, థాయ్ లాండ్, వియత్నాం నుంచి ఈ కీటకాలు సింగపూర్​కు సరఫరా కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కీటకాలతో ఆహారం తయారుచేసే హోటల్స్, రెస్టారెంట్ యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. కీటకాల ఆహార ఉత్పత్తుల విషయంలో కూడా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటుంది. కాగా, పురుగులను మాంసానికి ప్రత్యామ్నాయ ఆహారంగా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. కీటకాల్లో అధిక ప్రొటీన్ ఉంటుందని పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ

ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్‌ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి

సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్‌.. సీరియస్‌గా రియాక్టైన సందీప్‌ కిషన్

Follow us on