AP News: కింద 20 రూపాయలు పడ్డాయ్ మీవా అని అడిగాడు.. కట్ చేస్తే…
సొసైటీలో జాదుగాళ్లు పెరిగిపోయారు. సాయం చేస్తున్నట్లు నటిస్తూ నిండా ముంచేస్తున్నారు. ఎవర్నీ నమ్మడానికి లేకుండా పోయింది. తాజాగా సత్తెనపల్లిలో అలాంటి ఘటనే జరిగింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెడికల్ షాపులో మందులు కొనేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని రూ.20 కింద పడేసి ‘డబ్బులు మీవా?’ అని బాధితుణ్ని అడిగారు. అతను వాటికోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ని తెలివిగా కొట్టేసి అక్కడినుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ టీవీలో రికార్డయ్యాయి. బాధితుడు.. పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వైరల్ వీడియోలు
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!

