ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

Updated on: Jan 09, 2026 | 9:18 PM

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి సెలవు కోరిన ఉద్యోగినికి మేనేజర్ షాకింగ్ సలహా ఇచ్చాడు. తల్లిని ఆసుపత్రిలో చేర్చి ఆఫీస్‌కు రావాలని చెప్పడంతో, ఆవేదన చెందిన యువతి అక్కడికక్కడే రాజీనామా చేసింది. ఈ ఘటన రెడిట్‌లో వైరల్‌గా మారి, మేనేజర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పనిప్రదేశంలో మానవత్వం లేని ధోరణిని ఇది చాటుతుంది.

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి కొన్నిరోజులు సెలవు కావాలని కోరిన యువతికి మేనేజర్ వింత సలహా ఇచ్చాడు. ‘మీ తల్లిని ఆసుపత్రిలోనో లేక ఏదైనా షెల్టర్ హోంలోనో చేర్చి ఆఫీసుకు వచ్చేయండని చెప్పాడు. ఈ సమాధానంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉద్యోగిని అక్కడికక్కడే రాజీనామా లేఖ రాసిచ్చి వెళ్లిపోయింది. మేనేజర్ తీరును ఎండగడుతూ ఓ యూజర్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ పోస్ట్‌. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న మహిళ సెలవు కావాలని మేనేజర్ కు విజ్ఞప్తి చేసింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే మేనేజర్ మాత్రం సెలవు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదే కారణంతో ఇప్పటికే పలుమార్లు సెలవు పెట్టారని, మీ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోతే ఏదైనా షెల్టర్ హోంలో చేర్పించాలని ఉచిత సలహా ఇచ్చాడు. మేనేజర్ తీరుతో షాకైన ఆ మహిళా ఉద్యోగి గత్యంతరం లేక అప్పటికప్పుడే రాజీనామా చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ ఉచిత సలహా ఇచ్చిన మేనేజర్ ను అదే జవాబును రాతపూర్వకంగా ఇవ్వాలని అడగాల్సిందని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. రాజీనామా చేయాల్సింది కాదు.. బ్యాంకు వాళ్లే ఉద్యోగం తొలగించేదాకా ఉండాల్సిందని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LIC పాలసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా ?? ఇది మీకోసమే

రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

33 రోజుల్లో రికార్డ్స్ అవుట్.. అన్నీ అతడి హస్తగతం

Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే

Kalki 2: కల్కి 2పై ఖతర్నాక్ కబురు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే