SI Bribe: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్గా దొరికిన ఎస్సై.. తప్పించుకోడానికి ఖతర్‌నాక్ ప్లాన్..ఏంచేసాడో చూడండి..!
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎస్సై. అయితే ఆధారాలు దొరక్కుండా చేయడానికి ఓ ఖతర్‌నాక్ ప్లాన్ చేసాడు.
ఫరీదాబాద్‌కు చెందిన సుభ్నత్ అనే వ్యక్తి గేదెను ఎవరో దొంగిలించారు. దాంతో ఫిర్యాదు చేసేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై మహేంద్ర బాధితుడికి న్యాయం చేయాలంటే 10 లంచం డిమాండ్ చేశాడు. చేసేది లేక సుభ్నత్ తనవద్ద నున్న 6 వేల రూపాయలు ఎస్సైకి ఇచ్చాడు. మిగతా నాలుగు వేలు కూడా ఇస్తేనే కేసు సంగతి చూస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. దీంతో అతడు మిగతా 4 వేలు కూడా తెచ్చి ఇస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు దాడి చేసి ఎస్సైని పట్టుకున్నారు. ఊహించని ఆ సంఘటనతో ఒక్క క్షణం షాకైన ఎస్సై ఆధారాలు లేకుండా చేసేందుకు తీసుకున్న లంచం డబ్బును మింగేసే ప్రయత్నం చేస్తూ నోట్లను నోటిలో కుక్కేసుకున్నాడు. వెంటనే అలర్టయిన అధికారులు ఎస్సై నోట్లో వేలు పెట్టి నోట్లు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎస్సైని తమ వాహనంలో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
